News February 11, 2025

NLG: బ్రాహ్మణ వెల్లంలను పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి

image

బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ బ్యాంకు కెనాల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వారం రోజుల్లో అమరవాణి, అప్పాజీపేట దోమలపల్లి, కాకులకొండారం, నర్సింగ్ బట్ల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్‌ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఉదయ సముద్రం ఎడమ కాలువ పనులను సైతం పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 16, 2025

జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం: మంత్రి కోమటిరెడ్డి

image

సమాజ సమస్యలను ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్స్‌పీరియం ఎకో పార్కులో జరిగిన జర్నలిస్టుల కుటుంబాల గెట్-టు-గెదర్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీడియా మిత్రుల పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

News November 16, 2025

NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

News November 16, 2025

లోక్‌ అదాలత్‌లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్‌ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.