News July 31, 2024

NLG: భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

image

భూముల విలువను ప్రభుత్వం పెంచుతున్నట్టు ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు 10, 20 రిజిస్ట్రేషన్లు అయ్యేచోట 40 నుంచి 50 వరకు, 70, 80 అయ్యే చోట 150 నుంచి 180 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆగస్టు 1 నుంచే ధరలు పెరుగుతాయని ప్రచారం సాగుతుండటంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.

Similar News

News December 10, 2024

నల్గొండ జిల్లాలో అంగన్వాడీల అరిగోస!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4 వేల మంది అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవక అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే జీతం మూరెడు బాధ్యతలు మాత్రం బారెడు అన్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో అధిక భారమై సతమతమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీల ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 9, 2024

NLG: మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని మూడు పాత రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి విడతలో నల్గొండ, రెండో విడతలో మిర్యాలగూడ, ఆఖరి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News December 8, 2024

4 లైన్ల రోడ్లకు రూ.236 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

image

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి నార్కెట్ పల్లి- అద్దంకి -మెదర్ మెట్ల వరకు 236 కోట్ల రూపాయల వ్యయంతో 4లైన్ల నూతన సిసి రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ ద్వారా జి ఓఆర్ టి నంబర్ 926 జారీ చేసింది. వైటిపిఎస్ నుండి నామ్ రోడ్ వరకు 4 లైన్ల సిసి రోడ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.