News September 11, 2024
NLG: భౌమాకోన్ ఎక్స్ పో ఇండియాకు రావాలని మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.
Similar News
News October 13, 2024
NLG: పత్తి రైతుకు దక్కని మద్దతు ధర
నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.
News October 12, 2024
NLG: గోపాలమిత్రలు సేవలు భేష్
గోపాలమిత్రలు ఆపదలో ఉన్న పశుపోషకులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం వీరు వెళ్లి పశువులకు పశువైద్యం అందిస్తున్నారు. పండగ వేళల్లో సైతం తమ సేవలను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని గోపాలమిత్రల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ కోరారు.
News October 12, 2024
హుజూర్‌నగర్: యాక్సిడెంట్.. యువకుడి మృతి
బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామ రోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుజుర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తోకల మహేశ్ స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడు. దీంతో దసరా పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.