News March 28, 2025

NLG: మధ్యాహ్నం వేళ.. రోడ్లన్నీ ఖాళీ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News April 3, 2025

రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్ 

image

రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డులకు మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. సాగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులో పేర్లను సైతం మీ- సేవ కేంద్రాలద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామే స్వచ్ఛందంగా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తామని తెలిపారు.

News April 2, 2025

NLG: ఇప్పుడే ఇలా.. మున్ముందు ఇంకెలాగో!

image

వేసవికాలం అంటే ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటం సాధారణం. కానీ జిల్లాలో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెల్లవారడమే ఆలస్యం అన్నట్లుగా ఉదయం నుంచే సూర్య ప్రతాపం ప్రారంభం అవుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఈనెల చివరి వరకు, మేలో ఎండల ప్రభావం ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2025

NLG: ట్యాంకర్లతో పంట రక్షణ

image

జిల్లాలో వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.1000 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.

error: Content is protected !!