News April 16, 2025
NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.
Similar News
News October 30, 2025
ఐఐఐటీ బెంగళూరులో ఉద్యోగాలు

ఐఐఐటీ బెంగళూరు 5 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Sr రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును srinivas.vivek@iiib.ac.in మెయిల్కు పంపాలి. వెబ్సైట్: https://iiitb.ac.in
News October 30, 2025
సికింద్రాబాద్.. మరిన్ని రైళ్లు CANCEL

మొంథా తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను పార్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR ప్రకటించింది. గుంటూరు సికింద్రాబాద్ 12705 పూర్తిగా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్- గుంటూరు రైలును 12706 వరంగల్ నుంచి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేశారు.12701 గుంటూరు- సికింద్రాబాద్ రైలు డోర్నకల్ సికింద్రాబాద్ మధ్యలో క్యాన్సిల్ చేశారు.
News October 30, 2025
వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.


