News April 16, 2025
NLG: మరోసారి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 17 నుంచి 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. తదుపరి నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అంతకుముందు ఏప్రిల్ 11, 15, 16న డిగ్రీ పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే.
Similar News
News July 11, 2025
కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.
News July 11, 2025
రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు: ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్‌ను తెరమీదకు తెస్తున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు మాత్రమే లాభం జరిగిందని, దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘కేటీఆర్‌కు నిజంగా దమ్ముంటే.. కేసీఆర్ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలి’ అంటూ సవాలు విసిరారు.
News July 11, 2025
కొత్తగూడెం: మొన్న గల్లంతు.. నేడు మృతదేహం లభ్యం.!

మణుగూరు మండలం బాంబే కాలనీ సమీపంలోని రేగుల గండి చెరువులో సింగరేణి ఉద్యోగి సుంకరి శ్రీనివాస్ స్నేహితులతో ఈతకు వెళ్లి బుధవారం గల్లంతయ్యారు. గురువారం NDRF బృందాలు, రెస్క్యూ టీం సాయంతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.