News November 10, 2024
NLG: మరో నాలుగేళ్లు ఉచిత బియ్యం!
రేషన్ కార్డుదారులకు మరో నాలుగేళ్లు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతీ యూనిట్ కు ఆరు కిలోలు ఉచితంగా ఇవ్వనుండగా ప్రభుత్వం ప్రతినెల చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,88,124 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. యూనిట్ కి 6 కిలోల చొప్పున కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News December 14, 2024
NLG: మామపై దాడి.. కోడలికి రిమాండ్
వృద్ధుడు, దివ్యాంగుడైన మామపై <<14828145>>చెప్పుతో దాడి<<>> చేసిన ఘటనలో అతని కోడలిని రిమాండ్‌కు తరలించినట్లు వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 20న భూ వివాదంలో శెట్టిపాలెంకి చెందిన గగినపల్లి బుచ్చిరెడ్డిపై అతడి కోడలు మణిమాల చెప్పుతో దాడి చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి మణిమాలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు.
News December 14, 2024
తెలంగాణ- ఆంధ్ర చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు
కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో ఆంధ్ర – తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు బోనస్ ధర ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు.
News December 13, 2024
భువనగిరి ఒక్కటే మిగిలింది!
త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.