News December 26, 2024
NLG: మళ్లీ పడగ విప్పుతున్న ఫ్లోరైడ్ భూతం
NLG జిల్లాలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పెరుగుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా మర్రిగూడ మండలంలో నిర్వహిస్తున్న సర్వేలో ఫ్లోరోసిస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ మండలంలో 20 గ్రామపంచాయతీలో 39,700 మందిపై సర్వే నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు 880 కుటుంబాలు 4 వేలకు పైగా ప్రజలపై ఈ ఫ్లోరోసిస్ సర్వేను వైద్య సిబ్బంది పూర్తి చేశారు. శివన్నగూడ, బట్లపల్లి గ్రామాల్లో అధికంగా ఫ్లోరైడ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 5, 2025
నల్గొండ: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్
కనగల్ మండలంలో జీ.యడవల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్కు గురై రైతు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఎంఏ రషీద్ ఖాన్ తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన మన్నెం గోపి(32) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటర్ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2025
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
News February 5, 2025
చెర్వుగట్టులో ఆటో వాలాల దోపిడీ: భక్తులు
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో ఆటోల దోపిడీకి అంతులేకుండా పోయిందని భక్తులు మండిపడుతున్నారు. గుట్టపైకి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఆటోల డ్రైవర్లు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఒక్కో భక్తుడి వద్ద గుట్ట పైకి వెళ్లడానికే రూ.20ల ఛార్జి తీసుకున్నారని చెబుతున్నారు. ఆటోలపై అధికారుల నియంత్రణ లేకపోవడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.