News February 12, 2025

NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

image

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.

Similar News

News October 25, 2025

NLG: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..!

image

జిల్లాలో ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదు (4906)లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా 2 వేల దరఖాస్తులు తక్కువ రావడం అధికారులను నివ్వెరపోయేలా చేసింది. అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది.

News October 25, 2025

NLG: లక్కు ఎవరిదో.. డ్రా కోసం కౌంట్ డౌన్

image

జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం లక్కీ డ్రా ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి లక్కు ఎవరిని వరించబోతుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 27న నల్గొండ లక్ష్మీ గార్డెన్స్‌లో డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 25, 2025

నల్గొండ: పెరగనున్న ఎరువుల ధరలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చే యాసంగి సీజన్లో సాగుచేసే పంటలకు వేసే ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. తాజాగా కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు సంచికి రూ.50 పెరగ్గా మరి కొన్నింటికి 50కిలోల బస్తాపై రూ.25 నుంచి రూ.వంద వరకు ధరల పెంపు ఉంటుందని ఎరువుల దుకాణాల డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం పాత నిల్వలు ఉండడంతో గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. పెరగనున్న ఎరువుల ధరలు రైతులకు భారం కానున్నాయి.