News April 29, 2024
NLG: ముగిసిన నామినేషన్ల విత్ డ్రా గడువు

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరగబోయే ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. ఉమ్మడి జిల్లాలో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల తుది జాబితాను విడుదలపై రిటర్నింగ్ అధికారులు దృష్టి సారించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ప్రధాన పార్టీలు చివరి వరకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
Similar News
News October 30, 2025
NLG: డీసీసీల ఎంపిక మరింత ఆలస్యం..?

డీసీసీల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే డీసీసీల ఎంపిక చేయనున్నట్లు సమాచారం. నేతల మధ్య అంతర్గత పోరు, జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం రెండు నెలలు సమయం పట్టొచ్చని ఏఐసీసీ వర్గాల సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు డీసీసీల్లో ఒకటి ఓసీ, మిగతా రెండు ఎస్సీ, బీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.
News October 30, 2025
NLG: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, R&B, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు.
News October 30, 2025
NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.


