News April 3, 2025

NLG: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

‘పది’ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా <<15971907>>తిరగాలని<<>> భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. నిన్న యాదాద్రి(D)లో ఈతకు వెళ్లి ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News April 12, 2025

మద్యం మత్తులో డ్రైవర్.. ఇటుకల లారీ పల్టీ

image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్‌తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.

News April 12, 2025

NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

image

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.

News April 12, 2025

NLG: 8సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ’

image

ఈ నెల రెండవ శనివారం, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలైనప్పటికీ రాజీవ్ యువశక్తి పథకం కింద దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలలో స్పష్టం చేశారు. రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ యువత స్వయం ఉపాధి పొందేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!