News February 12, 2026
NLG: మూడు చోట్ల కౌంటింగ్.. రేపు తేలనున్న భవితవ్యం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13న జరగనుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి 3 చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 478 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 13న అభ్యర్థుల భవితవ్యం తేరనున్నది.
Similar News
News March 7, 2026
నల్గొండకు నేడు ముగ్గురు మంత్రుల రాక

నల్గొండ కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించనున్న ఈ భేటీ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
News March 6, 2026
NLG: ఇంటర్ పరీక్షలకు 261 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 9,796, మంది విద్యార్థులకు గాను 9,620 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1938 మంది విద్యార్థులకు గాను 1853 మంది హాజరుకాగా, 85 మంది గైర్హాజరయ్యారు.
News March 6, 2026
నల్గొండలో భానుడి ప్రతాపం

నల్గొండ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. గత నెల 15 నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం గరిష్ఠంగా 36.5 డిగ్రీలకు చేరాయి. మధ్యాహ్నం వేళ భానుడి సెగలకు జనం అల్లాడిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.


