News September 7, 2024
NLG: మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు!
జిల్లాలో గతంలో మాదిరి ఈసారి కూడా పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరుపనున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే సమకూర్చారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బందిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎన్నికల విధులకు అధికారులను, సిబ్బందిని ఎంపిక చేసేందుకు ఆయా శాఖల నుంచి ఉద్యోగుల, అధికారుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించారు
Similar News
News October 9, 2024
నల్గొండ: పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ టీచర్‌గా సెలక్ట్
ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కొట్టడమే కష్టం. ఇక జాబ్ వచ్చాక రిలాక్స్ అయి పోతుంటారు కొందరు. అలాంటిది నేరేడుగొమ్ము మండలంలోని తిమ్మాపురం గ్రామానికి నిరంజన్ రెండు ఉద్యోగాలు సాధించాడు. పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో పట్టు వదలకుండా ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టీచర్‌గా ఎంపికయ్యాడు.
News October 9, 2024
దేవాలయ ధర్మకర్తల మండలికి దరఖాస్తులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ సహాయ కమిషనర్ అనపర్తి సులోచన ఒక ప్రకటనలో తెలిపారు. కట్టంగూర్, చిట్యాల, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్ పల్లి మండలాలలోని ఆలయాల్లో ధర్మకర్తల మండలికి 20 రోజుల్లోగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఆమె సూచించారు.
News October 8, 2024
యాదాద్రి: రూ.10,65,000తో అమ్మవారి అలంకరణ
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో అమ్మవారిని రూ.10,65,000తో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.