News October 15, 2024
NLG: మూసీకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత

మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. HYD నగరంతోపాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 అడుగులు ఉంది.
Similar News
News January 8, 2026
బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: అడిషనల్ ఎస్పీ

జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
News January 8, 2026
ఇళ్లకు తాళం వేస్తే జాగ్రత్త : ఎస్పీ శరత్ చంద్ర పవార్

సంక్రాంతి సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. నగదు, నగలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపరిచితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 8, 2026
నల్గొండ: అన్ని పార్టీల చూపు అటు వైపు..

పురపాలిక నుంచి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన నల్గొండలో రాజకీయ సెగ మొదలైంది. తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహల్లో మునిగిపోయాయి. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ మంత్రి కోమటిరెడ్డి కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తుండగా, కేంద్ర నిధులే అస్త్రంగా కమలనాథులు కదులుతున్నారు. పాత పట్టును నిలుపుకునేందుకు BRS మౌనంగా పావులు కదుపుతోంది. ఇక్కడ ఎవరు పాగా వేస్తారో కామెంట్ చేయండి.


