News February 26, 2026

NLG: మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.85 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆగిపోయిన పనులను రూ.85 కోట్లతో పూర్తి చేసి కళాశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, కాబోయే డాక్టర్లు మానవత్వంతో పేదలకు సేవలందించాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News April 14, 2026

గద్వాల్: చేనేత కార్మికులకు శుభవార్త

image

జోగులాంబ గద్వాల జిల్లా చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులు ఎదురుచూస్తున్న చేనేత భరోసా పథకం ఈ నెల 16న గద్వాలలోని అనంత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించనున్నట్లు ఏడీవో బాలకృష్ణ తెలిపారు. చేనేత రుణమాఫీ, చేనేత భరోసా, చేనేత భీమా పథకాలకు సంబంధించిన చెక్కులను గురువారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్మికులందరూ రావాలని ఆహ్వానించారు.

News April 14, 2026

యాదగిరిగుట్ట: ఈనెల 28 నుంచి స్వామివారి జయంతి ఉత్సవాలు

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 28 నుంచి 30 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. 28న లక్ష కుంకుమార్చన, 29న లక్ష పుష్పార్చన, 30న సహస్ర ఘటాభిషేకం, నృసింహ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

News April 14, 2026

పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

image

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్‌ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.