News March 20, 2025
NLG: మే నాటికి ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి: భట్టి

ఈ ఏడాది మే నెల నాటికి ఉమ్మడి జిల్లాలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
NLG: 2025@విషాదాల సంవత్సరం

2025లో NLG జిల్లాలో పలు భారీ రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. HYD-సాగర్, HYD- VJD, NKP- అద్దంకి హైవేలపై భారీ ప్రమాదాలు జగిరాయి. ఈ ప్రమాదాలలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. 2025లో రాచకొండ పరిధిలో (NLGలో కొంత భాగం ) మొత్తం 3,488 రోడ్డు ప్రమాదాలు జరగగా.. అందులో 650 మంది మరణించినట్లు సమాచారం.
News December 23, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం
News December 22, 2025
NLG: ప్రజావాణికి 53 దరఖాస్తులు

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 53 మంది అర్జీలు సమర్పించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 26, తక్కిన 27 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.


