News May 24, 2024

NLG: మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!

image

నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా HYDలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు. ఆ అధికారి సహకారంతో మైనర్‌ను నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను NLGకు తరలించినట్టు సమాచారం.

Similar News

News February 12, 2025

NLG: ప్రారంభమైన నామినేషన్‌ల ఉపసంహరణ 

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉపసంహరించుకోవాలని, ఉపసంహరణకు ఒక్కరోజే సమయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 1 నామినేషన్ తిరస్కరణకు గురి కాగా 22 మంది బరిలో ఉన్నారు.

News February 12, 2025

NLG: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కీలక సూచన

image

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మీసేవా కేంద్రాల్లో చేసుకోవాల్సిన అవసరం లేదని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులను కలెక్టరేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం ఆన్‌లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కొత్త వారు, ఇంతకు ముందు దరఖాస్తు చేయని వారు మాత్రమే చేసుకోవాలన్నారు.

News February 12, 2025

నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్‌ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!