News October 10, 2024
NLG: యాసంగి సాగు ప్రణాళిక ఖరారు
వ్యవసాయ శాఖ యాసంగి సాగు ప్రణాళికను ఖరారు చేసింది. వానాకాలం సీజన్ ముగియడంతో.. గత యాసంగి సీజన్లో జిల్లాలో 4,44,041 ఎకరాల్లో వరి, వేరుశనగ, పెసర తదితర పంటలు సాగు కాగా ప్రస్తుత యాసంగిలో 5.83 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటల సాగు కానున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చెరువులు , కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .
Similar News
News November 14, 2024
చండూరు అమ్మాయికి అమెరికా అందాల పోటీలో అవార్డు
చండూరుకి చెందిన ప్రవాస భారతీయురాలు బావండ్ల రిషితకు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది. ఈ నెల 11న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. బావంద్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
News November 14, 2024
నల్లగొండ: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం
నవంబర్ 15 తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్ఎం M.రాజశేఖర్ గురువారం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనీ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి పైన సూచించిన సమయంలో 08682 223307 నంబర్‌కు డయల్ చేయాలని కోరారు.
News November 14, 2024
నల్గొండ: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. రామన్నగూడెం వాసి రాములు(59) తుంగతుర్తి శివారులో బైక్ ఢీకొట్టడంతో మృతిచెందారు. అటు రంగారెడ్డి జిల్లాకి చెందిన అభిలాశ్(24) చౌటుప్పల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. తిప్పర్తి (M) మల్లేవారిగూడానికి చెందిన కొండయ్య పొలం పనికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో స్పాట్‌లో మృతిచెందాడు.