News July 2, 2024
NLG: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు వివరాలు.. NLGజిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన వాసి వంశీకృష్ణ(19) HYDలో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RRజిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 12, 2025
NLG: GGHలో భద్రత డొల్ల!…

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
News March 12, 2025
నల్గొండ జిల్లా వాసుల ఎదురుచూపు..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో NLG జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పరిశ్రమలు, మునుగోడులో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల పూర్తి చేయాల్సి ఉంది. కట్టంగూరు మండలం ఆయిటి పాముల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.