News March 21, 2025
NLG: యువ వికాసానికి ఆదిలోనే చిక్కులు..!

యువ వికాసం పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనన్న నిబంధన పెట్టడంతో జిల్లాలో నిరుద్యోగులకు శాపంగా మారింది. రేషన్ కార్డు నిబంధనలతో ఆశావహులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను వెంటనే తొలగించాలని వివిధ పార్టీల నేతలు, నిరుద్యోగులు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతోంది.
Similar News
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
News April 1, 2025
BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్లో గన్మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
NLG: ఆన్లైన్లో పేరు ఉన్నా.. సన్న బియ్యం!

కొత్తగా రేషన్ కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.