News August 8, 2024
NLG: యూనిట్ చెడిపోయి రెండేళ్లు
నాగార్జునసాగర్ ఎడమకాల్వపై ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక యూనిట్ 2014 సంవత్సరంలో పెన్ స్టాక్ గేటు పనిచేయక నీరు వచ్చి మరమ్మతులకు గురైంది. జెన్కో అధికారులు దీనికి 2015లో మరమ్మతులు నిర్వహించినప్పటికీ తిరిగి 2022లో మరమ్మతులకు గురైంది. యూనిట్ చెడిపోయి రెండేళ్లు అవుతున్నా… జెన్కో అధికారులు మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Similar News
News September 14, 2024
NLG: ‘గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి’
NLG జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసి రివర్, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలండి అడవిదేవుల పల్లి, కొండ భీమనపల్లి, డిండి పోలీస్ పికెట్లు, హెడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
News September 14, 2024
మదర్ డైరీ ఛైర్మన్‌గా మధుసూదన్ రెడ్డి
రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
News September 14, 2024
నల్లగొండ: ఇంటర్ విద్యతో ఎంజీ యూనివర్సిటీలో PG కోర్సు
ఇంటర్ విద్యతో నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (PG ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చని ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఈ కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( CPGET – 2024) ద్వారా అర్హత సాధించి యూనివర్సిటీని ఎంచుకోవాలని సూచించారు.