News March 19, 2025

NLG: రాజకీయ పార్టీలు సహకరించాలి: ఆర్డీవో

image

ఓటర్ జాబితా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చేర్పులు.. మార్పులకు రాజకీయ పార్టీలు సహకరించాలని నల్గొండ RDO అశోక్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో ఆన్‌లైన్లో రోజువారి ఓటర్ నమోదు అవుతున్న ఫామ్ 6,7,8ల పరిష్కారం, డూప్లికేట్ ఓటర్లు తొలగింపు, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News December 16, 2025

నల్గొండలో పోలింగ్‌కు పటిష్ఠ భద్రత

image

నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు. విజేతల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.

News December 16, 2025

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత నిర్వహణను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని ఆర్ఓలు, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీఓ, ఇతర అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత విడతల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.

News December 16, 2025

పేరుకే కొలువు.. వేతనాలు అందక 9 నెలలు!

image

నెలల తరబడి వేతనాలందక జిల్లాలోని ‘104’ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు కొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరి పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 100కు పైగానే 104 సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.