News April 3, 2025
NLG: రాజీవ్ యువ వికాసానికి ఇక నేరుగా దరఖాస్తులు!

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా SC, ST, BC, మైనార్టీ శాఖల పరిధిలోని 8 కార్పొరేషన్ల పరిధిలో రుణాలు పొందేందుకు ఇక నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే సర్వర్ ఇబ్బందులతో పాటు పలు విషయాలలో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 18, 2025
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీశాఖదేనని తీర్పునిచ్చింది. ఈ భూమి తమదేనని కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 8వారాల్లో భూమిని నోటిఫై చేయాలని CSను ఆదేశించింది. దీని విలువ రూ.వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
News December 18, 2025
ఈశాన్య మూల పెరగడం మంచిదేనా?

ఈశాన్య మూల పెరిగిన స్థలం సంపదలకు మూలమని కొందరు చెబుతారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం శుభకరమని నమ్ముతారు. అయితే, ఈశాన్యం మరీ ఎక్కువగా పెరగడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దీనివల్ల ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం మూలలు తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ దిశల నుంచి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుకే కేవలం స్థలం ప్రహరీగోడలో స్వల్పంగా మార్పు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News December 18, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరదేశి పంకజ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


