News March 24, 2026

NLG: రాయితీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాయితీ పథకాల అమలుకు రంగం సిద్ధమైంది. మొత్తం 431 యూనిట్ల ద్వారా రూ.541.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు ఆన్‌లైన్ (OBMMS) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.

Similar News

News April 20, 2026

NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.