News February 17, 2025
NLG: రాష్ట్రం నుంచి ఏకైక ప్లేయర్.. SP అభినందన

ఈనెల 14, 15న బెంగళూరులో జరిగిన ఫుట్‌బాల్ సౌత్ ఇండియా సెలక్షన్స్ ట్రయల్స్‌లో సూపర్ ఆటతో ఆకట్టుకున్న రాచూరి వెంకటసాయిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం అభినందించారు. కాగా, NLG ఛత్రపతి శివాజీ ఫుట్‌బాల్ క్లబ్‌కి చెందిన సాయి మార్చి 8,9 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్ రౌండ్ సెలక్షన్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటసాయి అని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తెలిపారు.
Similar News
News November 24, 2025
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీస్ సేవలు అందజేయాలని ఎస్పీ సూచించారు.
News November 24, 2025
NLG: 30వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

జిల్లాలో వివిధ రకాల చేయూత / ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పింఛన్లు) నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. పెన్షన్ దారులు పెన్షన్ మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుంచి పొందాలని సూచించారు.
News November 24, 2025
NLG: ఏర్పాట్లు వేగవంతం… సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టి సారిస్తున్నారు.


