News August 24, 2024

NLG: రుణమాఫీకి దండిగా దరఖాస్తులు

image

రుణమాఫీ కాని రైతులు వ్యవసాయశాఖ కార్యాలయాల్లోని గ్రీవెన్స్ సెల్‌లలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల జిల్లాలు అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించి 5,840 దరఖాస్తులు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

Similar News

News February 24, 2026

NLG: గృహలక్ష్మి లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ ఊరట

image

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద బేస్‌మెంట్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకుని, నిధులు అందక నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. బేస్‌మెంట్ వరకు కట్టిన వారికి లక్ష రూపాయలు మినహాయించి, మిగిలిన నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.నల్గొండ జిల్లాలో 150 మందికి ఈ అవకాశం కల్పించారు.

News February 24, 2026

NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

image

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

News February 24, 2026

నల్గొండ: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్‌ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండొద్దన్నారు.