News February 11, 2025
NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News March 28, 2025
NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.
News March 28, 2025
ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

నల్గొండ జిల్లాలో ఆసరా పింఛన్లను ఏప్రిల్ 4వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ పొందుటకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
News March 28, 2025
NLG: మధ్యాహ్నం వేళ.. రోడ్లన్నీ ఖాళీ..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.