News July 17, 2024
NLG: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.7500 కోట్ల అవసరం..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.
Similar News
News December 8, 2025
కట్టంగూరు: బాండ్ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్..!

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.
News December 7, 2025
మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్లో నిర్వహించారు. డివిజన్లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.
News December 7, 2025
NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


