News July 17, 2024

NLG: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.7500 కోట్ల అవసరం..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.

Similar News

News December 12, 2024

NLG: మంత్రి పదవి వీరిలో ఎవరికి..!

image

త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉమ్మడి NLG జిల్లా నుంచి రేవంత్  క్యాబినెట్‌లో బెర్త్ ఎవరికి అనే చర్చ నడుస్తోంది. ST సామాజిక వర్గానికి చెందిన MLA బాలు నాయక్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన MLA రాజగోపాల్ రెడ్డి, బీసీ MLA ఐలయ్య జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ముందున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వీరిలో ఎవరు మంత్రి అవుతారో కామెంట్ చేయండి. 

News December 12, 2024

NLG: ప్రత్యేక యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

image

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్‌లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి నల్గొండ జిల్లాలో 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

News December 12, 2024

NLG: పెన్షన్ లబ్ధిదారుల్లో నిరాశ

image

పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు లక్ష మందికి పైగానే పెన్షన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.