News June 6, 2024
NLG: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు నాదే: తీన్మార్ మల్లన్న

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్కుమార్, రాజ్బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
News December 5, 2025
ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్ క్రాస్ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.


