News February 2, 2025

NLG: రేపటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Similar News

News October 23, 2025

మిర్యాలగూడ: డీసీఎంలోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

image

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్‌లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్‌లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.

News October 23, 2025

NLG : ‘కాల్’ పోదు.. నెట్ రాదు.. BSNLతో తలనొప్పి

image

జిల్లాలో BSNL సేవల్లో అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు నెట్ వర్క్ సంబంధిత ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడం.. మాట్లాడుతుండగానే మధ్యలోనే కాల్ కట్ అవడం.. ఇక ఇంటర్నెట్ సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మొబైల్ డేటా రాకపోవడంతో యూపీఐ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సైతం అంతరాయం ఏర్పడుతుంది.

News October 23, 2025

NLG: ఇక ఆ స్కూళ్లల్లో బాలికలకు కరాటే శిక్షణ!

image

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.