News April 24, 2024
NLG: రేపటి నుంచే వేసవి సెలవులు: డిఇఓ

బుధవారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినట్లు నల్లగొండ డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 6, 2026
NLG: ప్రలోభాలను అణచివేయండి: రాణి కుముదిని

మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలను అణచివేయాలని, అక్రమ మద్యం, నగదు రవాణాపై ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు.
News February 6, 2026
నల్గొండ: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 6, 2026
నల్గొండ: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.


