News February 12, 2025
NLG: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు కీలక సూచన

కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మీసేవా కేంద్రాల్లో చేసుకోవాల్సిన అవసరం లేదని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులను కలెక్టరేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం ఆన్లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కొత్త వారు, ఇంతకు ముందు దరఖాస్తు చేయని వారు మాత్రమే చేసుకోవాలన్నారు.
Similar News
News November 11, 2025
NLG: వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ధాన్యం సేకరణపై సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నవంబర్, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.
News November 11, 2025
నల్గొండ: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 1,781 గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం జీతాలు, జీపీల మెయింటెనెన్స్ లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
News November 11, 2025
NLG: 50% సిలబస్ ఇంకా అలానే..!

ఇంటర్ సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 140 ఉన్నాయి. వాటిలో 12,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఐదు నెలల్లో కేవలం 50 శాతం మాత్రమే సిలబస్ పూర్తి అయింది.


