News January 18, 2025
NLG: రేషన్ కార్డు లేని కుటుంబాలు 27,527

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.
Similar News
News February 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.
News February 12, 2025
ఈతకు వచ్చి మునుగోడు యువకుడి మృతి

నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్‌కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
News February 12, 2025
నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.