News March 30, 2024
NLG: రైతులకు రూ.304 కోట్ల నష్టం…!

జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News February 8, 2026
ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది వీరే

ముకుందాపురంలో ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ గల్లంతవ్వగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. నీటిలో మునిగిపోయిన భార్యభర్తలు త్రిపురారం(M) కంపాసాగర్ చెందిన పుల్లయ్య, పద్మగా సమాచారం. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News February 7, 2026
ప్రలోభాలపై ఉక్కుపాదం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం ఆయన పలు చెక్‌పోస్టులను సందర్శించి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News February 7, 2026
డిండి ఐటీఐలో సోమవారం అప్రెంటిస్ మేళా

డిండి ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా (PMNAM) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరవల్లి రాధాకృష్ణ తెలిపారు. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9705182677 నంబర్‌ను సంప్రదించవచ్చు.


