News January 28, 2025
NLG: రైతు అకౌంట్లలో పెట్టుబడి సాయం

నల్గొండ జిల్లాలోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా జమ చేసింది. జిల్లాలోని 33 మండలాలకు గాను గట్టుప్పల్, గుడిపల్లి మండలాలు మినహా 31 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పెట్టుబడి సాయాన్ని జమచేసింది. 35,568 రైతుల ఖాతాల్లో 73,243 ఎకరాలకు ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.46,93,19,160 జమ చేసింది.
Similar News
News November 16, 2025
NLG: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న అన్ని పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లేపల్లి మండలం, పెండ్లిపాకల రిజర్వాయర్‌ను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
News November 15, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కఠినంగా ఆదేశించారు. శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన ఇండ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
News November 15, 2025
NLG: జీతాల అందక 8 నెలలు

నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 నెలలుగా తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలో సుమారు 100 మందికి పైగానే గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


