News July 25, 2024
NLG: రైతు బీమాకు ఆగస్టు 5 వరకు గడువు
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు వచ్చేనెల ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఏఓ పాల్వాయి శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామాల ఏఈఓలకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2024
NLG: కొలువు తీరనున్న కొత్త ఉపాధ్యాయులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీఎస్సీ 2024 సెలక్టెడ్ అభ్యర్థుల స్కూల్ అలాట్మెంట్ కౌన్సెలింగ్ మంగళవారం రాత్రి వరకు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 324 మంది ఉపాధ్యాయులు స్కూల్ జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్లను పొందారు. డీఈవో అశోక్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ముగిసినట్లు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
News October 16, 2024
‘కళాశాలల యాజమాన్యాలు సంయమనంతో వ్యవహరించాలి’
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఆలస్యాన్ని పేర్కొంటూ MG యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చిన దృష్ట్యా రిజిస్ట్రార్ ఆచార్య ఆలువాల రవి స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాల యాజమాన్యాలు సంయమనంతో స్పందించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడంలో కళాశాల కృషిని గుర్తు చేస్తూ మునుముందు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు.
News October 15, 2024
నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం
నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం 61,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 40,912 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.00 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 TMCలు కాగా ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 307.2834 TMCలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.