News January 27, 2025

NLG: రైతు మహాధర్నా సభ ఏర్పాట్ల పరిశీలన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్గొండలో పాల్గొనే ధర్నా కార్యక్రమం ఏర్పాట్లను క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డిలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

image

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్‌నగర్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్‌‌ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.

News February 18, 2025

పెద్దగట్టు జాతరలో స్వల్ప తొక్కిసలాట!

image

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో మంగళవారం రాత్రి స్వల్ప తొక్కిసలాట జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిచెట్టుకు సమీపంలో పోలీస్ పాయింట్ వద్ద మున్సిపల్ చెత్త ట్రాక్టర్ రాకతో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదని స్థానికులు వెల్లడించారు. చిన్నారులు కాస్త ఇబ్బంది పడ్డారు.

News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

error: Content is protected !!