News February 27, 2026
NLG: లవ్ మ్యారేజ్.. కళ్లలో కారం కొట్టి పొడిచారు

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడిపై యువతి కుటుంబీకులు దాడికి తెగబడ్డారు. HYDకి చెందిన అజయ్‌కుమార్‌ను మాట్లాడదామని యాదాద్రి (D) బొమ్మలరామారం(M) రామలింగంపల్లి శివారుకు పిలిచి, కళ్లలో కారం కొట్టి 14 చోట్ల కత్తితో పొడిచారు. బాధితుడు మృతిచెందాడని భావించి పరారయ్యారు. గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యాయత్నం కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Similar News
News April 20, 2026
హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
News April 20, 2026
హనుమకొండలో విద్యార్థినిపై దారుణం.. వీడియో వైరల్

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
News April 20, 2026
రహానే చెత్త రికార్డు

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.


