News November 11, 2024
NLG: లింకులు, ఓటీపీలు చెప్పొద్దు.. జిల్లా కలెక్టర్ కీలక సూచన

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎవరు ఓటీపీ లేదా లింకులు అడగరని, అలాగే ప్రజలు లింకులు, ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని లక్ష్మీపురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు సర్వే ఎలా చేస్తున్నారు పరిశీలించారు.
Similar News
News November 21, 2025
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై శుక్రవారం ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చీరల పంపిణీకి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలను పంపిణీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో కార్యదర్శి జిల్లా కలెక్టర్ నామినీగా ఉంటారన్నారు
News November 21, 2025
మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు

నల్లగొండ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూరగాయల ధరలు సామాన్యుడికి అందకుండా పైపైకి ఎగబాకుతున్నాయి.టమాటా కిలో 50 రూపాయలు,చిక్కుడుకాయ కిలో 140, గోకర, బెండకాయ,బీరకాయ కిలో 120, దోసకాయ కిలో 60, వంకాయ కిలో 80, క్యారెట్ కిలో120 రూపాయలకు అమ్ముతున్నారు.దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల తుఫాను ప్రభావంతోనే కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
News November 21, 2025
దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్‌కు బదిలీ

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.


