News June 20, 2024

NLG: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడగింపు

image

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 30తో ముగిస్తుండగా , గడువు తేదీని SEP 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.

Similar News

News December 15, 2025

నల్గొండ జిల్లాలో ఈనాటి ముఖ్యాంశాలు

image

నల్లగొండ : మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమేజేషన్
నల్గొండ: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా సాత్విక
చిట్యాల : డంపింగ్ యార్డుతో ఇబ్బందులు
నాంపల్లి : చెరువు నిండా వ్యర్థాలే
అనుముల : సాఫ్ట్వేర్ టు సర్పంచ్
దేవరకొండ : ముగిసిన మూడో విడత ప్రచారం
నకిరేకల్ : సర్పంచులకు సమస్యల స్వాగతం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?

News December 15, 2025

మూడో విడతకు నల్గొండ యంత్రాంగం సిద్ధం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు దేవరకొండ డివిజన్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 17న చందంపేట, దేవరకొండ సహా 9మండలాల్లోని 2,206 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన సిబ్బంది 2,647 ప్రిసైడింగ్‌, 2,959 అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌‌ పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సమక్షంలో సోమవారం ఈ ప్రక్రియ జరిగింది..

News December 15, 2025

చిట్యాల: రిగ్గింగ్ జరిగందంటూ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు

image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు, పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తన గుర్తుపై ఓటేసిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడేసి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.