News November 7, 2024

NLG: వార్డు సభ్యుడిగా చేయాలన్నా పోటీనే!

image

కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది.

Similar News

News February 23, 2026

NLG: ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు వెనకడుగు..!

image

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు శాపంగా మారాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో 3,300 ఇళ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం రూ.5 లక్షల సాయం సరిపోక, బేస్‌మెంట్ ఖర్చులకే లక్షలు అవుతుండటంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

News February 22, 2026

CM కప్.. ఫైనల్‌లో నల్గొండ హాకీ జట్టు

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.

News February 22, 2026

NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

image

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.