News September 15, 2024
NLG: వినాయక మండపంలో విషాదం

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం జరిగింది. కిష్టరాంపల్లికి చెందిన వర్ధన్ అనే విద్యార్థి వినాయక మండపంలో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్తో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా వర్ధన్ చింతపల్లిలో ఇంటర్ చదువుతున్నాడన్నారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 29, 2025
నల్గొండ: గౌడన్నా జర భద్రం!

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గౌడ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తడిసిన చెట్ల కాండాలు జారే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా చెట్టుపై పట్టు దొరకకపోవచ్చని, తుఫాను తగ్గేంత వరకు గీత వృత్తికి విరామం ఇవ్వాలని కోరుతున్నారు.
News October 29, 2025
NLG: రెచ్చిపోతున్న కుక్కలు.. పట్టించుకోరే..!

నల్గొండ జిల్లాలో కుక్కల దాడి ఘటనలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని పట్టణ, పల్లె ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అటు మున్సిపల్ సిబ్బంది గానీ, ఇటు గ్రామపంచాయతీ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నల్గొండ నాలుగో వార్డులో 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి.
News October 29, 2025
నల్గొండ జిల్లాలో స్కూళ్లకు సెలవులు

తుపాను ప్రభావం కారణంగా నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఆమె సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందిస్తే, తక్షణ సహాయం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.


