News July 29, 2024
NLG: వ్యవసాయ అధికారులకు భారంగా రైతు వేదికలు!

ఉమ్మడి జిల్లాలో రైతు వేదికల నిర్వహణ వ్యవసాయ అధికారులకు భారంగా మారుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 మండలాల్లో 314 రైతు వేదికలు ఉన్నాయి. వాటికి ప్రతి నెలా రావలసిన నిధులు నిలిచిపోయాయి. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే వివిధ పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వేదికల్లో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిధుల లేమీ కారణంగా వ్యవసాయ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News September 19, 2025
NLG: వ్యవసాయాధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

నిడమనూరు మండల వ్యవసాయ అధికారి ముని కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. యూరియా కోసం రైతులు గురువారం నిడమనూరులో 2 గంటలకు పైగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో సమయంలో వ్యవసాయాధికారి స్థానికంగా అందుబాటులో లేడన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 19, 2025
NLG: ఉపాధ్యాయుల సర్దుబాటు.. రిలీవ్కు అదేశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జిల్లా విద్యాశాఖలో 125 మంది ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ తదితర ఉపాధ్యాయులను కలెక్టర్ అనుమతితో డీఈఓ బిక్షపతి సర్దుబాటు చేశారు. వారందరినీ సంబంధిత పాఠశాలలో వెంటనే విధుల్లో చేరాలని సంబంధిత హెచ్ఎంలు వారిని రిలీవ్ చేసేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News September 18, 2025
నల్లగొండ : పత్తి కొనుగోలుకు సన్నాహాలు

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈసారి 5,67,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 4,54,090 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 7పత్తి కేంద్రాల కింద 24 పత్తి మిల్లులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిపై చేయనున్నారు.