News July 11, 2025
NLG: సంబురంగా మహిళాశక్తి సంబరాలు

జిల్లాలో మహిళా శక్తి సంబరాలు సంబురంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ పంపుల నిర్వహణ, చేపలు, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, పాల డెయిరీ ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News August 31, 2025
నల్గొండను ఎండబెట్టారు: మంత్రి కోమటిరెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డుకుని ఎండబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో మాట్లాడతామని స్పష్టం చేశారు. కవిత ‘లిల్లీపుట్’ వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డి పరువు తీసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
News August 31, 2025
NLG: పత్తి రైతు పరేషాన్.. దిగుబడిపై ప్రభావం

ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి చేలలో ఇంకా తడారలేదు. వరద నీటిలోనే మొక్కలు ఉండడం అధిక తడితో మొలకలు ఎర్రబారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మొక్కలు ఎదిగే సమయానికి భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల పత్తి చేలల్లోకి నీళ్లు వచ్చాయని రైతులు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
News August 31, 2025
NLG: రేషన్ డీలర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్‌ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను మొత్తం రూ.140 (రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50) కమీషన్ రూపంలో డీలరుకు అందుతుంది.