News November 7, 2024

NLG: సమగ్ర సర్వేలో కలెక్టర్.. వివరాలు అందజేత

image

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఇంటికి సర్వే నిమిత్తం వచ్చిన ఎన్యుమరేటర్‌కు వివరాలను తెలిపారు. ఎన్యుమరేటర్ ఆయేషా హమీరా కలెక్టర్ ఇంటి నంబర్, ఇంటి యజమాని, తదితర వివరాలను అడిగి తెలుసుకొని ఇంటికి అతికించే స్టిక్కర్‌పై నమోదు చేశారు. వార్డు కోడ్, బ్లాక్ తదితర కోడ్ నంబర్లు నమోదు చేశారు.

Similar News

News November 15, 2025

NLG: కుటుంబానికి ఒక్కటే.. అదీ అందడం లేదు!

image

జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు డీలర్లు సంచులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ షాపుల పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సంచుల్లో ఇవ్వాల్సి ఉండగా చాలా గ్రామాలలో లబ్ధిదారులకు అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ రేషన్ ఇస్తున్నా సంచులు ఇవ్వడం లేదు. అదే విధంగా 6 కిలోలకు ఒక సంచి చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కుటుంబానికి ఒకటి చొప్పున డీలర్లు పంపిణీ చేస్తున్నారు.

News November 15, 2025

నాగార్జునసాగర్ ఆసుపత్రిలో చిన్నారులకు అస్వస్థత

image

సాగర్‌లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్లూకోజ్, ఇంజెక్షన్లు ఇచ్చాక ఒక్కసారిగా చలి, జ్వరం, వాంతులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

NLG: పేరుకే జిల్లా ఆస్పత్రి.. HYD వెళ్లాల్సిందే..

image

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మెదడు, ఇతర ప్రధాన అవయవాలకు గాయాలైనప్పుడు ఎంఆర్‌ఐ స్కాన్, స్పెషలిస్టుల చికిత్స తప్పనిసరి. ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ ఉన్నప్పటికీ, స్పెషలిస్టులు లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సైతం ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం HYD పంపించాల్సిన దుస్థితి నెలకొంది.