News November 7, 2024
NLG: సమగ్ర సర్వేలో కలెక్టర్.. వివరాలు అందజేత
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఇంటికి సర్వే నిమిత్తం వచ్చిన ఎన్యుమరేటర్‌కు వివరాలను తెలిపారు. ఎన్యుమరేటర్ ఆయేషా హమీరా కలెక్టర్ ఇంటి నంబర్, ఇంటి యజమాని, తదితర వివరాలను అడిగి తెలుసుకొని ఇంటికి అతికించే స్టిక్కర్‌పై నమోదు చేశారు. వార్డు కోడ్, బ్లాక్ తదితర కోడ్ నంబర్లు నమోదు చేశారు.
Similar News
News December 1, 2024
కోదాడ: బావిలో పడి విద్యార్థి మృతి
అనంతగిరి మండలం శాంతినగర్‌లోని ఎస్సీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వీరబాబు వ్యవసాయ బావిలో స్నానానికి దూకగా, అతనితోపాటు విద్యార్థి తిరుమలేష్ దూకాడు. ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు.
News December 1, 2024
గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య
నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుకుమార్ రెడ్డికి కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2024
డిసెంబర్ 3న యాదగిరిగుట్ట స్వామి వారి హుండీ లెక్కింపు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని డిసెంబర్ 3న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.