News October 11, 2024

NLG: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి 

image

ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్థులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 

Similar News

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.

News December 1, 2025

బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

image

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం