News December 26, 2024

NLG: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?

image

జీపీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1770 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 856, సూర్యాపేట జిల్లాలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 జీపీలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ జీపీలు ఏ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని అనుకుంటున్నారు. కామెంట్ చేయండి.

Similar News

News January 20, 2025

యాదగిరి నర్సన్నకు దండిగా నిత్య ఆదాయం

image

యాదగిరి నర్సన్న ఆలయానికి ఆదివారం భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు. 2700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,35,000, ప్రసాద విక్రయాలు రూ.20,62,120, VIP దర్శనాలు రూ.9,75,000, బ్రేక్ దర్శనాలు రూ.4,70,100, కార్ పార్కింగ్ రూ.6,50,000, వ్రతాలు రూ.1,38,400, యాదరుషి నిలయం రూ.2,71,187, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.51,40,252 ఆదాయం వచ్చింది.

News January 19, 2025

జాన్‌పహడ్ సైదన్న జాతరకు వేళాయే

image

మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్‌పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.

News January 19, 2025

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.