News November 8, 2024
NLG: సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్
మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్‌లో గురువారం కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరికీ సమాచారాన్ని వెల్లడించేది కాదని, అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.
Similar News
News December 10, 2024
NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ
ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
News December 10, 2024
NLG: అప్రెంటిస్ షిప్‌లో దరఖాస్తుల ఆహ్వానం
బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి మూడేళ్లపాటు ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
News December 10, 2024
నల్గొండ జిల్లాలో అంగన్వాడీల అరిగోస!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 4 వేల మంది అంగన్వాడీలు అరిగోస పడుతున్నారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవక అష్టకష్టాలు పడుతున్నారు. వచ్చే జీతం మూరెడు బాధ్యతలు మాత్రం బారెడు అన్న చందంగా అంగన్వాడీ కేంద్రం పనులే కాకుండా ఇతర ప్రభుత్వ పనుల ఒత్తిడితో అధిక భారమై సతమతమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీల ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.